twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళసృజనకు తెలుగు మెరుగులు-సంక్రాంతి

    By Staff
    |

    తమిళంలోపెద్ద హిట్‌ అయిన ఆనందంవెంకటేష్‌ హీరోగా తెలుగులోసంక్రాంతి టైటిల్‌తో రేపు విడుదలకానుంది. ఫిబ్రవరి సినిమాలన్నిటిలోకీసంక్రాంతిమీద భారీ అంచనాలున్నాయి.ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతనుతెలియజెప్పే ఈ సినిమాను ఆర్‌బి చౌదరి నిర్మించారు. ఈసినిమాలో ఫ్యామిలీ సెంటిమెంటేకాక హాస్యం, సంగీతం హైలైట్స్‌ అని యూనిట్‌సభ్యులు చెబుతున్నారు. చిన్న కుటుంబాలు ఏర్పడక తప్పనినేటి రోజుల్లోఉమ్మడి కుటుంబంలోని ఆనందాలనుతెలియచెబుతున్నామని స్వయంగాఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నవెంకటేష్‌ అంటున్నాడు.

    ఈసినిమాలోవెంకటేష్‌తో పాటు శ్రీకాంత్‌, ఆర్తిఅగర్వాల్‌, స్నేహ, సంగీత, రతి, శారదనటిస్తున్నారు. వెంకటేష్‌తో రాజావంటి సూపర్‌హిట్‌ సినిమా తీసిన ముప్పలనేని శివ సంక్రాంతిదర్శకత్వం వహించారు. ఇటీవలలవ్‌టుడే విద్యార్ధి వంటి సినిమాలతోనష్టపోయిన ఆర్‌బి చౌదరికి ఈ సినిమాపైఎన్నో ఆశలున్నాయి. చాలా గ్యాప్‌ తర్వాతశారద ఈ సినిమాలో నటించారు. గ్యాప్‌వచ్చిన తర్వాత నటించడంకష్టమేనని అంత గొప్ప ఊర్వసి అవార్డుపొందిన శారద అనడం విశేషం.సంగీత దర్శకుడు ఎస్‌ఎరాజ్‌కుమార్‌కు ఇది నూట యాభయ్యో సినిమా. ఈసినిమా ఆడియో బయట అంతఆదరణ పొందనప్పటికీ సినిమాలోపల్లెటూరి సన్నివేశాల్లో గీతాలు బాగాఅన్పించవచ్చని భావిస్తున్నారు. ఈ సినిమాలో భాస్కరభట్లరవికుమార్‌ రాసినచిలకా చందన పట్టు చీర కట్టిందోయ్‌పాట మాస్‌కు బాగా పడుతుంది. శంకరమహదేవన్‌, సుజాత పాడినశోభనం పాట ఇది.

    తమిళ వెర్షన్‌లో మూడు పాటలే ఉన్నాయి.వాటికి మరో మూడు పాటల్ని జత చేశారు.అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ చాలాతక్కువ ఉందని, ఇక్కడ అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనేఉద్దేశంతో వినోదాన్ని జోడించామని దర్శకుడు శివచెప్పారు. ఆర్తి అగర్వాల్‌ ఫ్లాష్‌బ్యాక్‌సన్నివేశాలు తమిళంలో లేవని, వాటిని పెట్టడంతోకథ మరింతబలంగానూ, బాగానూ వచ్చిందనివివరించారు. క్లాస్‌ను మాస్‌ను ఆకట్టుకునేకమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉండేలాజాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X