ఒకే షెడ్యూలులోబాలకృష్ణ చిత్రం
జయంత్ పరాన్జీదర్శకత్వంలో పిబి ఆర్ట్స్ పతాకంపై బాలకృష్ణ హీరోగా నిర్మాణం కానున్నచిత్రం మార్చి పదోతేదీన ప్రారంభమైఒకే షెడ్యూలులో పూర్తి కానుంది. మార్చి ఐదునప్రారంభం కావలసిన ఈ సినిమా బాలకృష్ణ విదేశీ పర్యటన కారణంగావాయిదా పడింది. కొన్ని ఫ్లాప్‌ల తర్వాతకథల విషయంలో జాగ్రత్త పడుతున్నబాలకృష్ణ ఈ సినిమా కథలోనూకలుగజేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.తాను స్వయంగా కథరాసుకున్నప్పటికీ ఎవరి పని వారు చేస్తేనేబాగుంటుందని ఆయన విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా కథా చర్చలు రెండు నెలలకు పైగాజరగడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌విశాఖపట్నం, అరకు, ఎదురువాడ,తాటిపూడి, హైదరాబాద్ లొకేషన్లలోజరుగనుంది. ఇది పిబి ఆర్ట్స్ ప్రసాద్ మూడోసినిమా. సంగీతం మణిశర్మ, మాటలుపరుచూరి బ్రదర్స్, కెమెరా అజయ్‌విన్సెంట్, ఫైట్స్ విక్రం ధర్మ.


Click it and Unblock the Notifications











