చిరు నర్సాపురం ఎందుకువెళ్లలేదు?
శంకర్‌దాదాఎంబిబిఎస్ 125 రోజుల ఉత్సవానికి చిరంజీవి హాజరుకాకపోవడానికి పోలీసుల నిస్సహాయతతో పాటు రాజకీయ కారణాలుకూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చిరంజీవిబహిరంగసభకు భద్రతా ఏర్పాట్లు చేయడం ఇంత తక్కువసమయంలోతమ వల్ల కాదని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులుచేతులెత్తేసిన మాట వాస్తవమే. గతఏడాది తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రిలో మదర్ థెరిసావిగ్రహావిష్కరణ సభలో అభిమానులతొక్కిసలాట కారణంగా చిరంజీవి విగ్ర హంవరకు వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఆయనవిగ్రహాన్నిఆవిష్కరించకుండా వెనుదిరిగారు. ఉభయగోదావరి జిల్లాల్లో చిరంజీవికి అత్యధికసంఖ్యలో అభిమానులున్నారు. నర్సాపురంలోశంకర్‌దాదా ఉత్సవం ఏర్పాటు చేసిన కళాశాల ప్రాంగణంలోయాభైవేలకు మించి జనం పట్టరు. చిరంజీవివస్తే కనీసం మూడు లక్షల మంది జనంఅక్కడ గుమికూడుతారని అంచనా వేసినజిల్లా పోలీసులు సభకు రావద్దని చిరంజీవికి విన్నవించుకున్నారు.
ఈవిజయోత్సవ సభకు జనం ఎక్కువగాహాజరవుతారు కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్, తెలుగుదేశంనాయకులు అనుకోవడంతో, రాజకీయాలజోలికి అనవసరంగా పోరాదని గతఎన్నికల తర్వాత నిర్ణయించుకున్న చిరంజీవికిపోలీసుల నివేదిక నెత్తి మీద పాలు పోసినట్టయింది. ఈసభకు చిరంజీవి హాజరుకాకపోయినా అల్లు అరవింద్ సెల్ ఫోన్ ద్వారా ఆయనఅభిమానులకు సందేశం ఇచ్చారు. చిరంజీవి ఎప్పటికైనా సొంతంగా ఒకరాజకీయ పార్టీ పెట్టి అసెంబ్లీలో తొంభైశాతం సీట్లను కైవసం చేసుకుంటారనిప్రకటించడం రాజకీయ వర్గాల్లోసంచలనం సృష్టించింది. ఒక సామాజికవర్గానికి చెందిన రాజకీయ నాయకులు చిరంజీవి సొంతపార్టీతో రాజకీయాల్లోకిరావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











