పవన్‌కళ్యాణ్‌లో మంచి మార్పు!
సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్‌కు మంచి స్నేహితుడు వెంకటేష్ ఒక్కడే. ఇతరులతో పవన్ ఫ్రీగా మూవ్ కాలేడు. వెంకీ-పవన్ వేవ్ లెంగ్త్ బాగా కలుస్తుంది. ఏవైనా సరదా సందర్భాలను షేర్ చేసుకోవాలంటే అతను వెంకటేష్‌నే ఆశ్రయిస్తాడు. వెంకటేష్ ఘర్షణ ఆడియో ఫంక్షన్‌కు పవన్ హాజరు కావడం పెద్ద వార్త అయింది. ఎందుకంటే ఇల్లు, ఫాంహౌస్, తన షూటింగ్ స్పాట్స్ తప్ప మరెక్కడా పవన్ కన్పించేవాడు కాదు. ఇప్పుడిప్పుడే అతను తన పద్ధతులను మార్చుకుంటున్నట్టుకన్పిస్తోంది. ఒక అగ్రశ్రేణి తెలుగు పత్రికకు, మరో నెంబర్ వన్ ఆంగ్ల పత్రికకు ఆయన ఇటీవల ఇంటర్వ్యూలు ఇచ్చాడు. పవన్‌లోకలుపుగోలు తనం పెరుగుతున్న సూచనలుకన్పిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











