శంకర్‌దాదా,ఆనంద్ నేటికి వందరోజులు
శంకర్‌దాదా,ఎంబిబిఎస్, ఆనంద్ సినిమాలు శనివారంవందో రోజుకు అడుగుపెట్టాయి. చిరంజీవిశంకర్‌దాదా మొదటి నెలలోకలెక్షన్ల వర్షం కురించగా,ఆనంద్ నిదానంగా అందుకుంది. కుటుంబమంతా కలిసిచూడదగిన మంచికాఫీ లాంటి సినిమాగా పేరు రావడంతోప్రేక్షకులు థియేటర్లను వెదుక్కుంటూవస్తారు. రొటీన్ సినిమాలతోవిసిగిపోయిన ప్రేక్షకుడికి టైఫాయిడ్‌తర్వాత నాలుకచప్పబడిపోయినప్పుడు చింతకాయ పచ్చడితో అన్నం తింటే ఎలా ఉంటుందోఆనంద్ సినిమా అటువంటి ఫీలింగ్‌కలిగించింది. ఒక్క పది పదకొండు సీన్లుతప్ప రొటీన్‌గా ఉన్నప్పటికీ సినిమాకుమంచి ప్రాచుర్య వచ్చింది. ఈ సినిమాలోమొదటి నుంచి చివరి వరకు వర్షందృశ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కలెక్షన్లవర్షం కురుస్తోంది.


Click it and Unblock the Notifications











