మేలో చిరు, ఎన్టీఆర్ సిన్మాల క్లాష్
చిరంజీవి,ఎన్టీఆర్ భారీ సినిమాలు మే మొదటివారంలోవిడుదల కానున్నాయి. రెండు సినిమాలుఒకేసారి విడుదలైతే ఏది ఘన విజయంసాధిస్తుందన్న అంచనాలు ఇప్పటినుంచేమొదలయ్యాయి. ఎన్టీఆర్ తాజా సినిమానుబి.గోపాల్ దర్శకత్వంలో చెంగలవెంకటరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం అన్నపూర్ణ ఏడెకరాల్లో యాభైలక్షల రూపాయల ఖర్చుతో భారీ సెట్‌వేశారు. ఈ సెట్‌లో షూటింగ్ సోమవారంప్రారంభమైంది. ఈ సినిమాకుమణిశర్మ సంగీతం సమకూర్చారు.బాలీవుడ్ భామలు అమీషాపటేల్,సమీరారెడ్డి హీరోయిన్లు. ఈ సినిమా మేమొదటి వారంలో వేసవి సెలవుల్లోవిడుదల కానుంది. దాదాపు అదే సమయంలోచిరంజీవి ద్విపాత్రాభినయచిత్రం విడుదల కానుంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈసినిమాకు దర్శకుడు శ్రీను వైట్ల. గతంలో రెండు సార్లుచిరంజీవి- ఎన్టీఆర్ చిత్రాలు క్లాష్ అయ్యాయి. ఎన్టీఆర్ స్టూడెంట్‌నెంబర్ వన్‌విడుదలైన సమయంలోనే చిరంజీవిడాడీ విడుదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్‌సూపర్‌హిట్ కాగాడాడీ యావరేజిగా ఆడింది. ఆ తర్వాతఎన్టీఆర్ అల్లరి రాముడు విడుదలైనఐదు రోజుల తర్వాత చిరంజీవి ఇంద్రవిడుదలైంది. ఇంద్ర ఇండ్రస్టీరికార్డులను తిరగ రాయగా అల్లరిరాముడు యావరేజికి ఎక్కువగా హిట్‌కు తక్కువగా మిగిలింది. చిరంజీవి, ఎన్టీఆర్‌అభిమానుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంసాగుతోంది. ఎన్టీఆర్ చిరంజీవి స్ధానంలోకి వచ్చినెంబర్ వన్‌గా నిలిచారని ఆ మధ్యరాసిన ఒక సినిమా వారపత్రికఎడిటర్‌ను చిరంజీవి అభిమానులుచితకబాదారు.


Click it and Unblock the Notifications











