సినిమా కథలపైచిరు వ్యూ!
తెలుగులోనేకాదు అన్ని ప్రపంచభాషల్లోనూ కథల కొరతఉందని చిరంజీవి అంటున్నారు. ఏ భాషా చిత్రాల సక్సెస్‌రేట్ అయినా గరిష్టంగా ఇరవై శాతమేననిఆయన చెప్పారు. రీమేక్‌లను వ్యతిరేకించవలసినఅవసరం లేదని, మరో భాషలో హిట్‌అయినా సినిమాను నాభాషలో నేను నా ప్రేక్షకులకుఅందించడంలో తప్పేముందని ఆయనప్రశ్నిస్తున్నారు. శంకర్‌దాదా ఎంబిబిఎస్‌కుమాతృక అయిన హిందీ మున్నాబాయ్‌కంటే ముందే తాను హాలివుడ్ చిత్రంప్యాచ్ ఆడమ్స్ చూశానని ఆయన చెప్పారు.అయితే దానిని ఇండియనైజ్ చేయడంకుదరదేమోననిఊరుకున్నానని, అదే మున్నాబాయ్‌గారావడం చూసి ఆనందించానని ఆయన చెప్పారు. కొత్తకథలను సృష్టించడం కష్టమని, ఉన్నకథలను కొత్తగా మలుచుకుంటే మంచిదేనని ఆయనఅభిప్రాయం.


Click it and Unblock the Notifications











