ఆచితూచి ఎన్టీఆర్‌అడుగులు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
జూనియర్‌ఎన్టీఆర్ ఇప్పుడు చాలా సీరియస్‌గా కన్పిస్తున్నాడు. నరసింహుడుఫ్లాప్ అయినప్పటి నుంచి దిగాలుగా కన్పిస్తున్న ఆయనకథలను బాగా స్క్రీన్ చేసిన తర్వాత కానీ కాల్షీట్లుఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు.ఇప్పుడు ఎన్టీఆర్‌కు సుమంత్ ఆర్ట్స్,జయభేరి, దుర్గా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్‌నుంచి ఆఫర్లు ఉన్నాయి. ఇవన్నీ మంచి అనుభవం ఉన్న నిర్మాణ సంస్ధలు.మొదట ఆయన సురేష్ ప్రొడక్షన్స్‌చిత్రంలో నటించే అవకాశముంది.రెండు మూడు సినిమాల్లో కొద్ది గ్యాప్‌లతో నటించి,ఒకటి, రెండునెలల వ్యవధిలో ఆ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేలా అతనుప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక మీదట తనసినిమాలకు సంబంధించి పబ్లిసిటీకి దూరంగా ఉండాలని ఆయనఆలోచన.


Click it and Unblock the Notifications











