సూపర్‌ప్రచారం, ఫలితం వారంలో
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
సూపర్‌హిట్ అయితే నాగార్జున డబుల్‌హ్యాట్రిక్ సాధిస్తాడు. ఏ భాషలోనైనా ఒక హీరోడబుల్ హ్యాట్రిక్ సాధించడమంటే చిన్నవిషయం కాదు. సూపర్ సినిమాఅనుకున్నట్టు రావడానికి నాగార్జున కొన్నిసన్నివేశాలను రీషూట్ చేయించారు.గతంలో మన్మధుడు, మాస్‌చిత్రాల్లో కూడా కొన్ని సన్నివేశాలను నాగార్జునరీషూట్ చేయించారు.ఇంతవరకు బాగానే ఉంది. వేలంవెర్రిసహజమైన తెలుగు సినిమా రంగంలోకొన్ని సినిమాలపై విపరీతమైన ప్రచారంజరుగుతుంటుంది. కృష్ణా నగర్ నుంచిపత్రికలు టీవీ ఛానళ్ళు వెబ్ సైట్లు ఆ సినిమా గురించి పదే పదే రాస్తూప్రేక్షుకుల్లో విపరీతమైన ఆసక్తిరేకిత్తిస్తుంటాయి. తీరా ఆ సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌కుతగినట్టు ఉండకపోతే నిర్మాతలకు నిరుత్సాహం తప్పదు. తాజాగానరసింహుడు సినిమా ఇందుకుఉదాహరణ.
నాగార్జునసూపర్ సినిమా మీద కూడా విపరీతమైనప్రచారం జరుగుతోంది. నటుడిగానే గాకనిర్మాతగా కూడా నాగార్జున పరిణతి సాధించడం, పూరీ జగన్నాధ్‌దర్శకుడు కావడం వల్ల సూపర్‌మీద ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు.కానీ ఈ సినిమా క్లెయిమాక్స్ సన్నివేశాల చిత్రీకరణకు రెండు కోట్లరూపాయలు, నాగార్జున హెయిర్ స్టయిల్‌మెయింటెనెన్స్‌కు రెండు లక్షలుఖర్చయ్యాయంటూ వస్తున్న వార్తలు ఈ సినిమాకు ఎంతమేలు చేస్తాయో ఈ నెల 20 వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











