సెల్వరాఘవన్‌చిత్రంలో వెంకటేష్
వెంకటేష్‌కొత్త సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇటీవలే ఎ.ఎం. రత్నం, సూపర్‌గుడ్ మూవీస్ అంగీకరించిన ఆయనసెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమాలోనటించనున్నారు.సెల్వరాఘవన్ ప్రస్తుతంపెదుపెట్టై తమిళ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆసినిమా పూర్తయిన తర్వాత వెంకటేష్‌తెలుగు సినిమాకు ఆయన దర్శకత్వంవహిస్తారు.వెంకటేష్ సూపర్‌గుడ్ మూవీస్‌చిత్రానికి పక్కింటి అబ్బాయి అని పేరుపెట్టారు. వెంకటేష్ మరో కొత్త సినిమాపేరు ఆడవారి మాటలకు అర్ధాలు వేరులేఅని పెట్టవచ్చని తెలుస్తోంది. సాయిదేవా ప్రొడక్షన్స్‌పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు 7/జి బృందావన్‌కాలనీ సినిమాకు దర్శకత్వం వహించినశ్రీ రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.వెంకటేష్ కోసమే ప్రత్యేకంగా ఈ కథనుతయారుచేశామని, కథకు ఆడవారిమాటలకు అర్ధాలు వేరులే అనే టైటిల్‌సంపూర్ణంగా సరిపోతుందని శ్రీ రాఘవచెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సోనీఅగర్వాల్ (బృందావన్ కాలనీ ఫేం).


Click it and Unblock the Notifications











