విదేశీలొకేషన్లు ఉండని బంగారం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పవన్‌కళ్యాణ్ బంగారంలో విదేశీలొకేషన్లు ఉండవు. ఈ విషయాన్ని నిర్మాతఎఎం రత్నం ఆదివారం విలేకరుల సమావేశంలోచెప్పారు. చిన్న సినిమాలు కూడా విదేశాల్లో పాటలుచిత్రీకరించుకుంటున్న నేటి ట్రెండ్‌కు భిన్నంగా బంగారంపూర్తిగా స్వదేశీగా రూపుదిద్దుకోవడంవిశేషం. శ్రీ సూర్యా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈసినిమాకు ధరణి దర్శకత్వంవహిస్తున్నారు.బంగారం తదుపరి షెడ్యూల్‌రేపటి (జులై 19) నుంచి ప్రారంభమైపూర్తయ్యేవరకు ఏకధాటిగాజరుగనుంది. హైదరాబాద్‌లో అరవైరోజులు, అరకు లోయలో పది రోజుల పాటు షూటింగ్‌జరుగుతుంది. పవన్ కళ్యాణ్‌సరసన మీరాచోప్రా నటిస్తోంది.సంగీతం విద్యాసాగర్. ఎఎం రత్నంపవన్‌తో తీసిన ఖుషి సూపర్ హిట్‌అయింది.


Click it and Unblock the Notifications











