మహేష్‌బాబుపై విజయ్ ఆశలు
ప్రముఖ తమిళ హీరో విజయ్‌కి స్ఫూర్తి కలిగించినది తెలుగు హీరో మహేష్‌బాబు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా అంగీకరించాడు. రజనీకాంత్ తరహా మాస్ మసాలా హీరోగా మారిన విజయ్ ఇప్పుడు తమిళనాడు గ్రామీణప్రాంతాల్లో హాట్ ఫేవరైట్‌గా మారాడు. తెలుగు ఒక్కడు (మహేష్‌బాబు) తమిళ రీమేక్ గిల్లి సూపర్‌హిట్ అయింది. ఇటీవల విడుదలైన తిరుపాచి తెలుగు అర్జున్‌కు రీమేక్. ఈ రెండూ అనధికార రీమేక్‌లు.త్రివిక్రం దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న అతడు సినిమా రీమేక్ హక్కుల కోసం విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. విజయ్ అడుగుతున్నాడు కదా అని నిర్మాతలు చెట్టెక్కి కూర్చున్నారు. కోటిన్నర రూపాయలు అడుగుతున్నారు. విజయ్ యాభై లక్షలు ఇస్తానన్నాడు. బేరం కుదరలేదు. మహేష్‌బాబు ఒక మాట చెబితే నిర్మాతలు ఒప్పుకుంటారని విజయ్ ఆశ.


Click it and Unblock the Notifications











