అవునన్నాకాదన్నా పై తేజ ఆశలు
కష్టాల్లోఉన్న తేజ త్వరలో విడుదలకానున్న అవునన్నా కాదన్నా సినిమాఆదుకుంటుందని ఆశిస్తున్నాడు. మళ్ళీఉదయ్‌కిరణ్, ఆర్పీ పట్నాయక్, తేజకాంబినేషన్‌లో ఈ సినిమా రానుండడంతోబయ్యర్లు వెనుకాడడం లేదనితెలిసింది. ఇటీవల విడుదలైనధైర్యం సినిమా ఫ్లాప్ కావడం,తేజకు నిర్మాతలకు మధ్యశత్రుత్వం ఏర్పడడం, తేజగన్‌మన్లను ఏర్పాటు చేసుకోవడంతెలిసిందే.
అవునన్నాకాదన్నా సినిమాను లక్ష్మీప్రొడక్షన్స్‌బ్యానర్‌పై అట్లూరి పూర్ణచంద్రరావునిర్మిస్తున్నారు. ఈ సినిమాను తూర్పుగోదావరి జిల్లా కోనసీమ గ్రామీణ ప్రాంతాల్లోతీశారు. గ్రామీణ నేపధ్యం గల ఈ ప్రేమకథా చిత్రంలో ఉదయ్‌కిరణ్ పాత్రవెరైటీగా ఉంటుందని చెబుతున్నారు. ఈసినిమాలో మొత్తమ్మీద ఏదో ఎగ్రస్టాపడిందని, అందువల్ల సినిమావిజయవంతమవుతుందన్నవిశ్వాసాన్ని తేజ వ్యక్తం చేశారు.మనసంతా పెట్టి ఈ సినిమా తీశాననిఆయన అన్నారు. మరి ధైర్యంసినిమా మనసు పెట్టితీయలేదనుకోవాలా? గత ం మర్చిపోదాం.తేజ వంటి డైనమిక్ డైరెక్టర్‌నుంచి ఇంకా మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











