చిరంజీవి సిన్మా పేరుమేస్త్రి?
చిరంజీవిద్విపాత్రాభినయ చిత్రానికి బాస్ పేరుపరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీఫైనల్‌గా మేస్త్రి టైటిల్ ఖరారుకావచ్చని తెలియవచ్చింది. గీతా ఆర్ట్స్‌పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలోఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.చిరంజీవి బిగ్ బాస్‌ఫ్లాప్ కావడంతో బాస్ టైటిల్‌ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నచ్చలేదు. ప్రస్తుతం ఈసినిమా కోసంఒక పాటను లారెన్స్ రాఘవ చిరంజీవి,రక్షితలపై చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తండ్రీ కొడుకులుగానటిస్తున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్,మాటలు కోన వెంకట్ సమకూర్చారు.
ఈసినిమా షూటింగ్ కోసం ముంబాయి నుంచి అత్యాధునికమోషన్ కంట్రోల్ కెమెరాను తెప్పించారు.చిరంజీవి, టబులపై కొన్ని సన్నివేశాలను ఈ కెమెరాతోచిత్రీకరించారు. శ్రీను వైట్ల దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమా వేసవి సెలవుల్లోమేలో విడుదల కానుంది. స్నేహం కోసంసినిమా తర్వాత చిరంజీవి తండ్రీకొడుకులుగాద్విపాత్రాభినయ చిత్రం ఇదే.ఈ సినిమాలోకొడుకు చిరంజీవి బుద్ధిమంతుడు కాగా తండ్రిచిరంజీవిఅదో టైపు. తండ్రిది చంచల స్వభావం.కొడుకు చిరంజీవి తండ్రికి వ్యక్తిత్వ వికాసపాఠాలు చెబుతుంటాడు. బాస్ టైటిల్‌చిరంజీవికి,అల్లు అరవింద్‌కు నటించినప్పటికీ ఎవరోఒక ఫిటింగ్ పెట్టారు. గతంలో విజయబాపినీడు చిరంజీవితో తీసిన బిగ్ బాస్ ఫ్లాప్‌అయినందువల్ల ఈ సినిమాకు బాస్ అనే టైటిల్‌పనికి రాదని చిరంజీవి శ్రేయోభిలాషులఅభిప్రాయం.


Click it and Unblock the Notifications











