చక్రంలో ప్రేమ, ఫిలాసఫీ
ఆలస్యమైనా చక్రం సినిమా చక్కగా వచ్చిందని కృష్ణవంశీ మురిసిపోతున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ పేరు చక్రం. చార్మి, ఆశిన్‌లు హీరోయిన్లు. ఇది రొటీన్ ట్రాయాంగులర్ లవ్ స్టోరీ కాదని కృష్ణవంశీ అంటున్నారు. చక్రం కదులుతూ, జనాన్ని కదిలిస్తూ, స్ఫూర్తి కలిగిస్తుందని, మానవుడికీ చక్రానికీ అవానాభావ సంబంధముందని ఆయన ఫిలసాఫికల్‌గా చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడో 1977లో రాసిన జగమంతా కుటుంబ ం అనే ప్రైవేట్ సాంగ్ కృష్ణవంశీ నాలుగైదేళ్ళ క్రితం విన్నారట. ఆ పాట చక్రం సినిమా కథకు స్ఫూర్తినిచ్చింది. చార్మి, ఆశిన్ పాత్రలకు సినిమాలో ప్రాధాన్యం ఉంటుందట. సినిమాకు చక్రి సంగీతం ఇచ్చారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే పాట బాగా వచ్చిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











