twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ- భక్తిచిత్రాల మధ్య రాఘవేంద్రరావు

    By Staff
    |

    దర్శకుడుకె.రాఘవేంద్రరావు రెండుసినిమాలకు ఒకే సమయంలోదర్శకత్వం వహించాల్సిన పరిస్ధితిఏర్పడింది. నితిన్‌, త్రిష, రతి నటించేసినిమాను ఆయన ఈ నెల ముప్పైనప్రారంభిస్తున్నారు. రాధాగోపాళంనిర్మాత కె. అనిల్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈసినిమా రాఘవేంద్రరావుకి 102 వచిత్రం. రాఘవేంద్ర రావు ఎప్పుడోఒప్పుకున్న సినిమా ఇది. ఈమధ్యకీరవాణి ప్రోద్బలంపై నాగార్జునతోభక్త రామదాసు సినిమా తీయాలనిరాఘవేంద్రరావు అనుకున్నారు.నాగ్‌-పూరి జగన్నాధ్‌ల సినిమా చివరిదశలో ఉన్నందున వచ్చే నెలభక్త రామదాసు సినిమాప్రారంభించాలని నిర్మాతనిర్ణయించడంతో నితిన్‌ సినిమా నుంచిరాఘవేంద్రరావు తప్పుకుంటారన్నవార్తలు వచ్చాయి. ఆ వార్తలకు ఖండనగానిర్మాత అనిల్‌కుమార్‌రాఘవేంద్రరావు-నితిన్‌ సినిమాషెడ్యూలును నిన్న ప్రకటించారు. దీనితోభక్త రామదాసు కొన్ని నెలలు వాయిదాపడవచ్చు. ఈ సినిమాను ఎటూ 2006 శ్రీరామనవమికే విడుదల చేసే అవకాశముందికాబట్టి ఆలస్యమైనా ఫర్వాలేదనిచెబుతున్నారు.

    ఈ సినిమా తీస్తే బాగుంటుందన్నఆలోచన సంగీత దర్శకుడు కీరవాణికివచ్చింది. అన్నమయ్య చిత్రంలో గుండెలనుకదిలించే సంగీతం అందించిన కీరవాణిఇటీవల భద్రాచలం వె ళ్ళారు. ఆయనభక్తిభావంతో పులకించిపోయారట. శ్రీరాముడిపైరామదాసుకున్న భక్తి భావం తలచుకుంటేఆయన మదిలో ఎన్నో అద్భుత స్వరాలు కదిలాయి.భద్రాచలం వాతావరణం, అక్కడి గోదావరినది, ఆ ప్రాంత పవిత్రత కీరవాణిని కదిలించాయి.ఆయన దర్శకుడు రాఘవేంద్రరావుకుతన ఆలోచన గురించి వివరించారు. రామదాసుజీవితంలో భక్తి, రక్తి, విరక్తి, ముక్తిఅన్నీ ఎలిమెంట్సూ ఉండడంతో కమర్షియల్‌దర్శకుడు రాఘవేంద్రరావుకుతాను ఆశించే అన్ని అంశాలు ఉండడంతో నాగార్జునతోచర్చించి ప్రాజెక్టును ధృవపరుచుకున్నారు.అన్నమయ్య సినిమాకు అద్భుత కథ అందించినజెకె భారవికి ఈ సినిమా కథారచనబాధ్యతను అప్పగించారు. భారవి భద్రాచలంవెళ్ళి అక్కడి రామదాసు తొమ్మిదోతరంవారసులతో మాట్లాడి అనేక కొత్త విషయాలుతెలుసుకున్నారు. భక్త రామదాసు స్వగ్రామమైనఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కూడా రచయితకొన్ని రోజులు మకాం వేశారు. అన్నమయ్యసినిమాలోలేని గోదావరి ఈ సినిమా బాక్‌డ్రాప్‌లోఉంటుంది కాబట్టి ఇది అన్నమయ్య కంటే బాగుంటుందనిభావిస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలోఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది.ఈ సినిమాలో రాముడి పాత్ర ఏ అదృష్టవంతుడికిదక్కనుందో చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X