వెంకటేష్ సుభాష్‌చంద్రబోస్‌పై భారీ అంచనాలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని తయారు చేసిన సాహసి పాత్రలో వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. తండ్రి వెంకటేష్ ఆదర్శాలను కొడుకు వెంకటేష్ ముందుకు తీసుకెళ్తాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి. అశ్వనీదత్ భారీ వ్యయంతో రూపొందించిన ఈ సినిమాపై బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు సమాచారం. దీనికోసం బ్రిటీషు కాలాన్ని తలపింపజేసే భారీ సెట్లను నిర్మించారు. ఇది రాఘవేంద్రరావు నూట ఒకటో చిత్రం కావడం వల్ల కూడా క్రేజ్ ఏర్పడింది. నిన్న విడుదల చేసిన ఆడియోకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆడియోను ఎటువంటి హంగామా లేకుండా నాలుగు నగరాల్లో నలుగురు ప్రముఖుల చేతుల మీదగా విడుదల చేయించారు. సినిమాలో ఆరు పాటలు ఉండగా చంద్రబోస్ నాలుగు, సుద్దాల అశోక్ తేజ రెండు పాటలు రాశారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. జెనీలియా, శ్రీయ హీరోయిన్లు.


Click it and Unblock the Notifications











