చిరంజీవి సిన్మాటైటిల్ అందరివాడు
చిరంజీవిద్విపాత్రాభినయ చిత్రానికి అందరివాడుఅనే టైటిల్ ఖరారైంది. గీతా ఆర్ట్స్‌బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బాస్ మేస్త్రీటైటిల్స్‌ను గతంలో పరిశీలించారు. ఈసినిమాలో తండ్రి చిరంజీవి పేరుగోవిందరాజులు. కొడుకు చిరు పేరు సిద్ధార్ధ. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో చిరంజీవి, రక్షిత,కొందరు హాస్యనటులపై ఒకటి...రెండు...మూడు.. గోవిందుడు అందరివాడు,నాడు-నేడు- ఎప్పుడూ, తనుచెప్పిందే చేస్తుంటాడు... అనే పాటనులారెన్స్ రాఘవ దర్శకత్వంలోచిత్రీకరించారు.
ఈసినిమా షూటింగ్ కోసం ముంబాయి నుంచి అత్యాధునికమోషన్ కంట్రోల్ కెమెరాను తెప్పించారు.చిరంజీవి, టబులపై కొన్ని సన్నివేశాలను ఈ కెమెరాతోచిత్రీకరించారు. శ్రీను వైట్ల దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమా వేసవి సెలవుల్లోమేలో విడుదల కానుంది. స్నేహం కోసంసినిమా తర్వాత చిరంజీవి తండ్రీకొడుకులుగాద్విపాత్రాభినయ చిత్రం ఇదే.ఈ సినిమాలోకొడుకు చిరంజీవి బుద్ధిమంతుడు కాగా తండ్రిచిరంజీవిఅదో టైపు. తండ్రిది చంచల స్వభావం.కొడుకు చిరంజీవి తండ్రికి వ్యక్తిత్వ వికాసపాఠాలు చెబుతుంటాడు. బాస్ టైటిల్‌చిరంజీవికి,అల్లు అరవింద్‌కు నటించినప్పటికీ ఎవరోఒక ఫిటింగ్ పెట్టారు. గతంలో విజయబాపినీడు చిరంజీవితో తీసిన బిగ్ బాస్ ఫ్లాప్‌అయినందువల్ల ఈ సినిమాకు బాస్ అనే టైటిల్‌పనికి రాదని చిరంజీవి శ్రేయోభిలాషులఅభిప్రాయం. సంగీతం దేవిశ్రీప్రసాద్, మాటలు కోన వెంకట్ సమకూర్చారు.


Click it and Unblock the Notifications











