అందరివాడు ఖరారు, ది లీడర్ పరారు
చిరంజీవి ద్విపాత్రాభినయ చిత్రం అందరివాడుకు ది లీడర్ అనే ట్యాగ్‌లైన్‌ను చిరంజీవి తీవ్రంగా వ్యతిరేకించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయాల్లోకి రాకుండా ఉంటే అందరివాడిగా ఉంటానని, అందువల్లనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని గతంలో చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్లనే ఆయన అందరివాడు టైటిల్‌ను మనస్ఫూర్తిగా అంగీకరించినప్పటికీ ది లీడర్ అనే తోకను వ్యతిరేకించారు. దీని ట్యాగ్‌లైన్‌ను త్వరలో ఖరారు చేస్తారు.


Click it and Unblock the Notifications











