చిరు అందరివాడు మే 18న?
చిరంజీవి తాజా చిత్రం అందరివాడు దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు చంద్రముఖి బన్ని చిత్రాలు క్లాష్ కాకుండా ఒక అనుకూల తేదీ కోసం అన్వేషిస్తున్నారు. చంద్రముఖి చిరంజీవి చిరకాల మిత్రుడు రజనీకాంత్‌ది కాగా బన్ని చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్‌ది. చంద్రముఖి ఏప్రిల్ 14న విడుదల కానుండగా ఒక నెల గ్యాప్ ఇచ్చి అందరివాడును మే 18న విడుదల చేయాలనుకుంటున్నారు. ఏప్రిల్ ఆరున విడుదల కానున్న బన్ని సినిమా సూపర్‌హిట్ అయితే దానికి అడ్డు పడకుండా ఉండేందుకు అందరివాడు జూన్‌లో విడుదల చేసే అవకాశముంది.
అందరివాడు చిరంజీవి ద్విపాత్రాభినయ చిత్రం. శ్రీనువైట్ల దర్శకత్వంలో అల్లు అరవింద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిమ్మీసేన్, టబు హీరోయిన్లుగా, రక్షిత ఐటం స్టార్‌గా నటించారు. ఈ సినిమా టైటిల్‌కు ట్యాగ్‌లైన్‌గా ది లీడర్ ఉంచడానికి చిరంజీవి సుముఖంగా లేరని విశ్వసనీయంగా తెలిసింది.


Click it and Unblock the Notifications











