ఆఘమేఘాలమీద అందరివాడు
చిరంజీవిసినిమా అనగానే భారీ అంచనాలు, అభిమానులపందేలు మామూలే. నెలరోజుల్లో విడుదలకానున్న అందరి వాడు కూడా ఇందుకుమినహాయింపు కాదు. ఈ సినిమాను జూన్‌మొదటి వారంలోనే విడుదల చేసేందుకుపనులు చకచకా జరుగుతున్నాయి. మే11న ఆడియో విడుదల కావచ్చు. ఈ సినిమామోహన్‌లాల్ మలయాళ చిత్రంనట్టురాజవుకు అనుసరణ అన్నఅభిప్రాయం ఉంది. చిరంజీవి మాత్రం కొత్తగా ఉండేపక్కా మాస్ చిత్రమని చెబుతున్నారు. ఇదితనకో ఛేంజ్ అన్నారు. చిరంజీవి తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో నటిస్తుండగా ప్రధాన హీరోయిన్లుగాటబు, రిమ్మీసేన్, ఐటం నెంబర్ హీరోయిన్‌గారక్షిత నటిస్తున్నారు.అందరివాడును మేలోనే విడుదల చేయాల్సి ఉండగా అల్లు అర్జున్ బన్నికిహిట్ టాక్ రావడంతో దాని లైఫ్‌పెంచేందుకు చిరంజీవి సినిమా విడుదలప్రక్రియను స్లో చేశారు. కానీ ఇప్పుడుబన్ని కలెక్షన్లు ఇప్పుడుతగ్గడంతో త్వరత్వరగాఅందరివాడును విడుదల చేయడానికిసన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











