తండ్రిని దారిలో పెట్టే అందరివాడు
అందరివాడుసినిమాలో రిపీట్ అయ్యే డైలాగ్ నిన్ననేడు ఎప్పుడూ.... చెప్పిందే చేస్తుంటాడు.తండ్రి చిరంజీవి పేరు గోవిందరాజులు. అతనుఅదో టైపు. కొడుకు తప్పు దోవపడితే తండ్రిదారికి తేవడం సహజం. కానీ ఈ సినిమాలోఅలాకాదు. తండ్రి చల్ మోహనరంగాఅంటూ బాధ్యత లేకుండా తిరుగుతుంటేకొడుకు అతనికి వ్యక్తిత్వ వికాస పాఠాలునేర్పించి, సంఘంలో ఆయన గౌరవంకాపాడుతాడు. ఆ లక్ష్య సాధనలో కొడుకు ఎన్నో తిప్పలు పడతాడు.ఆ్రర్ధతతో పాటు సున్నిత హాస్యం ఉన్న సన్నివేశాలుబాగాపండాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌నిర్మించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వంవహించారు. టబు, రిమ్మిసేన్, రక్షితహీరోయిన్లుగా నటించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రెండుపాటలు మినహా సినిమా షూటింగ్ పార్టు పూర్తయింది. రెండుపాటల చిత్రీకరణకు సినిమా యూనిట్ మే 9నవిదేశాలకు బయలుదేరనుంది. వచ్చేవారం ఆడియో విడుదలవుతుంది. సినిమాను జూన్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగావిడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











