బాలకృష్ణసరసన సమీరారెడ్డి
తెలుగుసినిమా పరిశ్రమలోకి తుపానులాప్రవేశించిన సమీరారెడ్డి బాలకృష్ణసరసన అంబికా ప్రొడక్షన్స్ చిత్రంలో నటించనుంది. ఈసినిమాకు ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంవహిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోయిన్‌గాఆమె నటించిన తొలి తెలుగు చిత్రంనరసింహుడు ఈనెల 20న విడుదలకానుంది. అమె రెండో చిత్రం చిరంజీవిసరసన జై చిరంజీవ. తెలుగు సినిమాల్లోపాటలు, డ్యాన్సులు బాగుంటాయనిసమీరారెడ్డి అంటోంది. కొన్ని హిందీ సినిమాల్లో నటించిన సమీరాబెంగాలీలో ఒక సెమీ ఆర్ట్‌ఫిల్మ్‌లోనూ నటించింది. స్వతహాగాతెలుగు అమ్మాయి అయిన సమీరా రెడ్డిముంబాయిలోనే చదువుకుంది. ఇంట్లోఅమ్మ, నాన్న తెలుగులోనే మాట్లాడుకుంటారు కాబట్టి తెలుగుపలకడం తనకు ఇబ్బంది కాదనిచెప్పింది. ఇప్పుడు తెలుగు సినిమాపరిశ్రమలో అగ్రస్ధానంలో ఉన్న త్రిషకుసమీరా థ్రెట్ కాగలదని సినిమాపండితుల అంచనా.


Click it and Unblock the Notifications











