తడిసిమోపెడైన నరసింహుడు
ఎన్టీఆర్ నరసింహుడులో ఫ్యాక్షన్ ఘర్షణలు ఉండవని నిర్మాత చెంగల వెంకటరావు చెప్పారు. ఎన్టీఆర్ గత సినిమాలు ఆది, సింహాద్రి రెండు సినిమాలను కలిపితే నరసింహుడు అయ్యాడని చెబుతున్నారు. 1999లో సమరసింహారెడ్డి సినిమా తీసి పెద్ద హిట్ సాధించిన చెంగల వెంకటరావు మంచి కథ కోసం ఐదేళ్ళు ఆగవలసి వచ్చింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం భారీగా అయినట్టు సమాచారం. దాదాపు 20కోట్లు ఖర్చయిన ఈ సినిమాలో సమీరారెడ్డి, అమీషాపటేల్, ఆర్తి అగర్వాల్ నటించారు. ఈ సినిమా నిర్మాణానికి ముందు గత నాలుగైదేళ్ళుగా కథల మీద బాగా ఖర్చు చేశారు. ఈ సినిమా సూపర్‌హిట్ అయితే తప్ప నిర్మాణ వ్యయం వెనక్కి తిరిగి రాదు. ఈ సినిమాను ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. విడుదల మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.


Click it and Unblock the Notifications











