సంక్రాంతికిబంగారం విడుదల
పవన్‌కళ్యాణ్ బంగారం 2006 సంక్రాంతికివిడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ 160రోజుల పాటు జరుగుతుందని నిర్మాత ఎఎంరత్నం చెప్పారు. ఈ నెల పదకొండునషూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాయూనిట్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోఉంది. తదుపరి షూటింగ్ 50 రోజులపాటుతమిళనాడులో జరుగనుంది. తమిళంలోభారీ హిట్స్ అందించిన ధరణి ఈ సినిమాకుడైరెక్టర్. మీరా చోప్రా హీరోయిన్‌గానటిస్తున్న ఈ సినిమాలో ఇంకా అశుతోష్‌రాణా, ముఖేష్ రుషి, వేణుమాధవ్,అలీ, శ్రీధర్ తదితరులునటిస్తున్నారు. ఖుషి వంటిసూపర్‌హిట్ సినిమాను అందించిన శ్రీసూర్య మూవీస్ బ్యానర్ కిందరూపొందుతున్న ఈ సినిమాపైసహజంగానే భారీ అంచనాలున్నాయి.డిఫరెంట్ లొపేషన్లలో చిత్రీకరించవలసిఉన్నందున ఈ సినిమాకు ఎంతో ఖర్చుకానుంది. షూటింగ్ దినాలు కూడా ఎక్కువే.సంగీతం విద్యాసాగర్. ఇటీవలే ఒకపాటను రికార్డు చేశారు.


Click it and Unblock the Notifications











