నరసింహుడుకౌంట్‌డౌన్
ఎన్టీఆర్‌నరసింహుడు ఈనెల 20న 280 ప్రింట్లతోవిడుదల కానుంది. 1999లో సమరసింహారెడ్డివంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన నిర్మాతచెంగల వెంకటరావుదాదాపు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత తీసినచిత్రం కావడం, ఎన్టీఆర్, బి.గోపాల్,మణిశర్మ ఉండడంతో నరసింహుడుసినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.దీనికి తోడు నిర్మాత చెంగల వెంకటరావుఈ సినిమా 202 థియేటర్లలో వంద రోజులు ఆడుతుందనిపత్రికా ప్రకటనలు ఇవ్వడంతో ఇండ్రస్టీ చూపంతా ఈసినిమా పైనే ఉంది. ఎన్టీఆర్‌తోసమీరారెడ్డి, అమీషాపటేల్, ఆర్తి అగర్వాల్‌వంటి కత్తిలాంటి హీరోయిన్లు ఉండడంతోఎన్టీఆర్ అభిమానులు విడుదల తేదీ కోసంకళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.చెంగల వెంకటరావు ఎంతఖర్చుకైనా వెనుకాడకుండా కొన్ని సన్నివేశాలు నిండుగావచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక బి.గోపాల్ తరహాసుమో బ్లాస్టింగ్స్‌ను తెర మీద చూడవలసిందే.జంట నగరాల్లోనే 28 థియేటర్లలో ఈ సినిమావిడుదల కానుంది.


Click it and Unblock the Notifications











