నో ఓల్డ్‌హీరోస్: త్రిష బాటలో జెనీలియా
వయసుమీరిన హీరోల సరసన నటించబోననిత్రిష ప్రకటించిన కొద్ది రోజులకే జెనీలియా కూడా అటువంటి ప్రకటనచేసింది. జెనీలియా నటించిన భారీ చిత్రాలు నాఅల్లుడు, సుభాష్ చంద్రబోస్ బాక్సాఫీసువద్ద బోర్లాపడ్డాయి. సత్యం, బాయ్స్ మాత్రమే ఆమెచెప్పుకోదగిన చిత్రాలు. వయసు మీరినహీరోలు ఉత్సాహంగా, యూత్‌ఫుల్‌గా నటించడానికి ప్రయత్నించినా కెమెరాఅబద్ధం చెప్పదని, యవ్వనం ఉట్టిపడేతన పక్కన వాళ్ళు మరీ వయసుమీరినట్టు కన్పిస్తున్నారని, సినిమాఆడకపోవడానికి ఇదొక కారణమని ఆమెచెప్పింది. ఆమె పరోక్షంగా వెంకటేష్‌మీద ఈ కామెంట్స్ చేసింది. తాను తమిళయంగ్ హీరో విజయ్ సరసన నటించినసచిన్‌చిత్రం విజయవంతమైందనిఆమె సగర్వంగా చెబుతోంది. సుభాష్ చంద్రబోస్ స్క్రిప్టును తనకు చూపించిన తర్వాతమార్పులు చేశారని, చివరికి తాను పాటలకుమాత్రమే పరిమితం కావలసి వచ్చిందనిఆమె నిష్టూరంగా వివరించింది.


Click it and Unblock the Notifications











