చిరంజీవిరికార్డును బద్దలు కొట్టిన రజనీ
ఇప్పటివరకు దక్షిణాదిలో అత్యధిక పారితోషికంతీసుకుంటున్న హీరో చిరంజీవి.చంద్రముఖి సినిమాతో రజనీకాంత్ చిరంజీవి రికార్డునుఅధిగమించారు. ఈ సినిమాకు పారితోషికంగారజనీకాంత్ 15కోట్లు తీసుకుంటున్నారు. చంద్రముఖి సినిమానునిర్మించిన శివాజీ ఫిల్మ్స్‌తోచేసుకున్న ఒప్పందం ప్రకారంతమిళ,తెలుగు,కన్నడకలెక్షన్లలో యాభై శాతం రజనీకాంత్‌కుపారితోషికంగా చెల్లించాలి.చంద్రముఖి తమిళంలో 20 కోట్లు,తెలుగులో 7 కోట్లు, కన్నడంలో మూడు కోట్లువసూలు చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోకూడా చంద్రముఖి పెద్దహిట్ అయింది. మలేషియా, యుఎఇ,అమెరికాల్లో ఈ సినిమా హౌస్‌ఫుల్‌కలెక్షన్లు పొందుతోంది. విదేశాల్లోఎంత గొప్ప సినిమా అయినా రెండో వారంలోకలెక్షన్లు క్షీణిస్తాయి. కానీఆరువారైలైనా చంద్రముఖికలెక్షన్లు తగ్గకపోవడంవిశేషం. ఇటీవల కాలంలో విదేశాల్లో ఎక్కువరోజులు ఆడిన దక్షిణాది చిత్రం చిరంజీవిటాగూర్. దాని రికార్డును చంద్రముఖిబద్దలు కొట్టింది.


Click it and Unblock the Notifications











