పవన్ సినిమా పేరు బాలు, ఎబిసిడిఇఎఫ్‌జి
వైజయంతి బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమాకు వెరైటీ పేరు పెట్టారు. దానిపేరు బాలు, ఎబిసిడిఇఎఫ్‌జి. ఎబిసిడిఇఎఫ్‌జి అక్షరాలను పదాలుగా మార్చితే ఎ బోయ్ కెన్ డు ఎవిరిథింగ్ ఫర్ గాళ్. ఈ సినిమా దాదాపు ఎనభై శాతం తయారయింది.
షూటింగ్‌కు సమాంతరంగా శబ్దాలయలో దీని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు కరుణాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలు జనవరి మొదటి వారంలో సంక్రాంతికి ముందు విడుదల కానుంది. ఇది హాస్యం కలగలిసిన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











