తెలుగు తెరకుశ్రీయ 6నెలల విరామం?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
ఐశ్వర్యారాయ్, అయేష్ టకియా, త్రిష వంటి పేర్లను పరిశీలించాక రజనీకాంత్-శంకర్ సినిమా శివాజీలో శ్రీయ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ భారీ సినిమాను ఒప్పుకున్న పర్యవసానంగా శ్రీయ మరో ఆరునెలల వరకు మరో చిత్రంలో నటించే అవకాశం లేదు. పర్‌ఫెక్షనిస్టు అయిన శంకర్ ఏడాది పాటు షూటింగ్ చేస్తుంటారు. అదే జరిగితే శ్రీయ ఏడాది వరకు మరో సినిమాలో నటించే వీలు ఉండదు. హీరోయిన్లకు శంకర్ విధించే నిబంధనలు అటువంటివి. ఛత్రపతి విజయం తర్వాత శ్రీయ తెలుగు సినిమాల్లో మంచి స్ధితికి చేరుకుంది. కొంత పొందాలంటే కొంత త్యాగం చేయాలన్న సత్యాన్ని నమ్మే శ్రీయ ఆరునెలలు, ఏడాది పోయినా రజనీ-శంకర్ కాంబినేషన్‌లో నటించి చరిత్రకు ఎక్కాలనుకుంటోంది.


Click it and Unblock the Notifications