ఎన్టీఆర్ కుటుంబానికిఅచ్చివచ్చిన అంకిత
రస్నా బేబిఅంకిత నందమూరి వంశానికిమహాలక్ష్మిలా మారింది. బి. గోపాల్ దర్శకత్వంలోజూనియర్ ఎన్టీఆర్ చిత్రంలోప్రధాన హీరోయిన్‌గా ఎంపిక కావడంతన రెండో అదృష్టమని అంకితఅంటోంది. సెంటిమెంట్లకు ఎంతో విలువ ఇచ్చేహరికృష్ణ అయితే ఆమెను నందమూరివంశానికి కలిసోచ్చిన అదృష్టంగా భావిస్తున్నారు.
గుడివాడ నిర్మాతవైవిఎస్ చౌదరి నిర్మించిన లాహిరి లాహిరిలాహిరిలో (హరికృష్ణ లీడ్)తో తెలుగుతెరకు పరిచయమై మంచి పేరుతెచ్చుకున్న అంకిత ఎక్కువగా నందమూరి వారిసినిమాల్లోనే రాణించింది.
ఆ తర్వాతఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో నటించిన సింహాద్రిసినిమా దుమ్మురేపింది. ఈ నెలాఖరున విడుదలకానున్న బాలకృష్ణ చిత్రం విజయేంద్రవర్మలో కూడా అంకిత ప్రధానహీరోయిన్. విజయేంద్ర వర్మ హిట్ అయితే తన తదుపరి చిత్రంలోకూడాఅంకితను తీసుకునే అవకాశముంది.


Click it and Unblock the Notifications











