బాలకృష్ణఅల్లరి పిడుగు కౌంట్‌డౌన్
శుక్రవారంవిడుదలైన పెద్ద చిత్రంఛత్రపతి సెకండాఫ్ లోపంకారణంగా యావరేజిగా మిగిలిపోయింది. ఈనేపధ్యంలో సినిమా పరిశ్రమ దృష్టంతా అక్టోబర్ 5న విడుదలకానున్న అల్లరి పిడుగు మీద ఉంది. బాలకృష్ణ రెండు పాత్రలుపోషించిన ఈచిత్రంలో కత్రినా కైఫ్, చార్మీహీరోయిన్లుగా నటించారు. నిర్మాణానికి చాలాసమయం తీసుకున్న ఈ సినిమాపైఖర్చు బాగా అయింది. బాలకృష్ణ తోడల్లుడుఎంఆర్‌వి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జయంత్‌దర్శకత్వం వహించారు.గతంలో సమరసింహారెడ్డినరసింహనాయుడు వంటి సూపర్‌హిట్ చిత్రాలను ఇచ్చినబాలకృష్ణ ఆతర్వాత లక్ష్మీ నరసింహచెన్నకేశవరెడ్డి వంటి యావరేజి చిత్రాల్లోనటించి అభిమానులను నిరుత్సాహ పరిచాడు. ఆ తర్వాత పరిస్ధితిమరింత దిగజారింది. సీమ సింహంవిజయేంద్రవర్మ దారుణంగా ఫ్లాప్‌అయ్యాయి. విజయేంద్రవర్మ నాటికే పోలీసుకేసులు, కోర్టు కేసులతోసతమతమవుతున్న బాలకృష్ణఅప్పటి నుంచి అల్లరిపిడుగు చిత్రంపై దృష్టినిలిపారు. నిజానికి ఈ సినిమాస్టోరీలైన్‌ను బాలకృష్ణే ఇచ్చారట. జయంత్‌దానిని సమర్ధవంతంగాతెరకిక్కించినట్టు చెబుతున్నారు. చార్మి చీరచాటు అందాలను,కత్రినాకైఫ్ కాళ్ళ చందాలను జయంత్ రసవత్తరంగాచిత్రీకరించినట్టు ఆ సినిమా స్టిల్స్ చెబుతున్నాయి. ఒకసినిమా హిట్‌కావడానికి ఇవి అదనపు ఆకర్షణలే కానీఇవే సరిపోవు. స్క్రీన్‌ప్లే నైపుణ్యం,అవసరమైన చోట ఎమోషన్స్‌నుపండించడం, చక్కటి క్లెయిమాక్స్ ఏచిత్ర విజయానికైనా ముఖ్యాంశాలు. రెండురోజులు వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications











