మహేష్‌తోవైఎస్ బావమరిది సినిమా
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి బావమరిది, కడపమేయర్ రవీంద్రరెడ్డి త్వరలోమహేష్‌బాబు హీరోగా ఒక సినిమా నిర్మించనున్నారు. ఈవిషయాన్ని ఆయన ఒక సినిమా సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోవెల్లడించారు. 2006 జనవరి నుంచినాన్‌స్టాప్‌గా పెద్ద హీరోలతో, దర్శకులతోభారీ సినిమాలు నిర్మించాలనిఆయన నిర్ణయించుకున్నారు. కడపలోమూడు సినిమా థియేటర్లు గలరవీంద్రరెడ్డికి ఎగ్జిబిటర్‌గా ప్రేక్షకులనాడిపై అవగాహన ఉంది. కేవలం డబ్బుకోసమో, పేరు కోసమో సినిమాలు నిర్మించడం తనఅభిమతం కాదని,ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు.మహేష్‌బాబు డేట్స్ తన వద్దఉన్నాయని, ఆ సినిమా కోసం అద్భుతమైనకథ తయారవుతోందని చెప్పారు.కెఎస్ రవికుమార్ చౌదరి, వి వినాయక్,సురేందర్ రెడ్డిల దర్శకత్వంలోసినిమాలు తీయనున్నట్టు ఆయనతెలిపారు. బాలకృష్ణతో చిన్నికృష్ణ దర్శకుడిగా ఒకభారీ సినిమా తీయాలనిగతంలో అనుకున్నానని, కానీ ప్రాజెక్టులాభదాయకం కాదని తెలుసుకుని విరమించుకున్నానని,బాలకృష్ణతోఎప్పటికైనా సినిమా తీస్తానని ఆయనవివరించారు.


Click it and Unblock the Notifications











