చిరంజీవి సినిమాకథలో మార్పులు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ప్రముఖతమిళ దర్శకుడు మురుగదాస్‌డైరెక్షన్‌లో చిరంజీవి నటించనున్నసినిమా స్కిప్టులో కొన్ని మార్పులు చేయాలని దాస్‌భావిస్తున్నట్టు తెలుస్తోంది. సూర్య,ఆసిన్, నయనతార తదితరులతోమురుగదాస్ తీసిన ఘజని చిత్రంత్వరలో విడుదల కాబోతోంది. ఆ చిత్రాన్నిప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తెలుసుకున్నతర్వాత చిరంజీవి సినిమా స్క్రిప్టులో మార్పులుచేయాలని మురుగదాస్ అనుకుంటున్నారు. మురుగదాస్‌కథతోవచ్చిన చిరంజీవి చిత్రం టాగూర్ ప్రయోజనాత్మక చిత్రంగానే గాకసూపర్‌హిట్‌గా నిలిచింది. చిరంజీవి-మురుగదాస్ చిత్రం వేసవికివిడుదల కావలసి ఉంది. చిరంజీవి వేసవిచిత్రాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











