సి
అల్లు అర్జున్ హీరోగా ఎం.ఎస్.రాజు నిర్మించనున్ననిమాకు దర్శకుడు ఎవరన్నది కొద్దికాలంపాటు సస్పెన్స్‌గా ఉన్నా తాజాగా దర్శకుడు వీరశంకర్ పేరు బయటకు వచ్చింది. గతంలో యండమూరి వీరేంద్రనాథ్ పాపులర్ నవల వెన్నెల్లో ఆడపిల్లను ఐ లవ్ యూ అనే చిత్రంగా దర్శకుడు వీరశంకర్ రూపొందించారు. ఆ తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఇటీవలే పవన్ కల్యాణ్‌తో గుడుంబా శంకర్ చిత్రాన్ని రూపొందించారు. గుడుంబా శంకర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తెలుగులో వెంటనే ఆయనకు అవకాశాలు దక్కలేదు. ఇటీవలే కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా ఒక చిత్రాన్ని రూపొందించిన వీరశంకర్‌కు సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌లో దర్శకత్వం వహించే అవకాశం వరించింది. అదీ వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో అల్లు అర్జున్‌తో కావడం మరో విశేష ం.
పోకిరి వంటి సెన్సెషనల్ హిట్ తీసిన పూరీ జగన్నాథ్ తాజా చిత్రం అల్లు అర్జున్‌తో తీస్తున్నారు. నవంబర్ నాటికి ఆ చిత్రం పూర్తవుతుందనగా, ఎం.ఎస్.రాజు, వీరశంకర్, అర్జున్ కాంబినేషన్‌లో చిత్రం విజయదశమికి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











