అర్థాలు వేరులే..!
జయం చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్ రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే హిట్ కొట్టేసిన నితిన్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం, మాస్ ఇమేజ్ కోసం అర్థంలేని ఆరాటం ఆ యువ హీరో ప్రస్తుత పరిస్థితికి కారణం అనినిమా నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరైనా ఇట్టే వూహించేస్తారు. దిల్ చిత్రం తర్వాత మళ్లీ ఆ మోస్తరు హిట్ కోసం నితిన్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. తననునిమాకి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ మళ్లీ గట్టెక్కిస్తాడనుకుంటే.. ధైర్యం.. అంటూనే పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. ఆ చిత్రం ఫ్లాప్ సంగతి అటుంచితే, నితిన్ తండ్రికీ, తేజకు ఫైనాన్స్ గొడవలు జరిగి పెద్ద రభస అయ్యింది అప్పట్లో. ఆ తర్వాత నితిన్, మీరా చోప్రా జంటగా నటించిన సత్యం.. శివం.. సుందరం చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది. అది మినహా నితిన్‌కి ప్రస్తుతం ఎటువంటి చిత్రాలు లేవు.
అయితే, ఇప్పుడు అల్లరి రవి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక చిత్రం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సబ్జెక్ట్ ఓకె అయిపోయిందని, అన్నీ అనుకూలిస్తే మరో కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం.
నటుడు చలపతిరావు కుమారుడైన రవి నటుడిగా రాణిస్తునే అల్లరి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై తర్వాత అమ్మాయిలు-అబ్బాయిలు రూపొందించారు. అది ఫ్లాప్ కాగా, తర్వాత పార్టీ అనే మరో ఫ్లాప్ చిత్రం తీసి.. ఇప్పుడు మళ్లీ కొత్త చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


Click it and Unblock the Notifications











