Home
ఆగస్టు నెలలో బారులు తీరిన బడ్జెట్ చిత్రాలలో ఇప్పటికే ఒక డజను చిత్రాలు విడుదల కాగా మూడో వారానికి మరో నాలుగైదు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. సునీల్, ఆర్తీ జంటగా అందాల రాముడు, శివాజీ, అంకిత జంటగా సీతారాముడు, శివబాలాజీ హీరోగా అగంతకుడు, శింబు, రమ్య జంటగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ధీరుడు ఆగస్టు 18న (శుక్రవారం) విడుదలకు నోచుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఆగస్టు 11న హైదరాబాద్ మారియట్ హోటల్‌లో ఆడియో విడుదలైన రామ్‌గోపాల్ వర్మ చిత్రం శివ 2006 మొదట ఆగస్ట్ 25న విడుదలవుతుందని ప్రకటించినా ఇప్పుడు ఈ చిత్రం రెండు వారాల పాటు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 8కి వాయిదా పడిందని ఫిలింనగర్ సమాచారం. వర్మ సినిమా వాయిదా పడటంతో ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న మరో డబ్బింగ్ సినిమా ఫిబ్రవరి 14 ఆగస్టు 25న విడుదలకు నోచుకుంటోంది. శివ 2006 వాయిదాకి కారణాలు తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











