Home
ప్రస్తుతం అల్లరే అల్లరి చిత్రంలో చేస్తున్న కథానాయకుడు వేణు కొత్త చిత్రం నవంబర్ 1 దీపావళి పర్వదినాన ప్రారంభం కాబోతోంది. గతంలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన మిద్దె రామారావు తమ రాజ్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఒక సెల్‌ఫోన్ చుట్టూ తిరిగే కథలో కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉంటాయని నిర్మాత మిద్దె రామారావు వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా సూర్యదేవర లలిత ప్రభాకర్‌నాగ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, వి.వి.వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రభాకర్ ఎంతో అనుభవం ఉన్నవారని నిర్మాత చెప్పారు.
హీరో వేణు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ చక్కని కథతో ఈ సినిమా రూపొందనుందని దర్శకుడు లలిత ప్రభాకర్‌నాగ్ వెల్లడించారు. నవంబర్ 1న ప్రారంభమయ్యే ఈ చిత్రానికి సంబంధించి నటీనటవర్గం, సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు చెప్పారు.


Click it and Unblock the Notifications











