Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవి, మురుగదాస్‌ల ప్రతిష్టాత్మక చిత్రం స్టాలిన్ రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలాఖరులో కొన్ని రోజుల పాటు జరుగనుంది. చిరంజీవి మాత్రం ఫిబ్రవరి నుంచి షూటింగ్లో పాల్గొంటారు. ఈలోపు ఆయన లేని కొన్ని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరించనున్నారు. త్రిష హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాకు సంగీతం మణిశర్మ. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు నిర్మిస్తున్నారు. కాగా చిరంజీవికి ఈసారి పద్మభూషణ్ అవార్డు ఇవ్వబోతున్నారన్న వార్త ప్రచారంలో ఉంది. కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు చిరంజీవి కోసం గట్టిగా ప్రయత్నించినట్టు తెలిసింది. రేపు సాయంత్రం కల్లా అవార్డులను ప్రకటిస్తారు. చిరంజీవి పేరు గతంలో చాలా సార్లు పద్మ అవార్డులకు నామినేట్ అయినప్పటికీ ఇంత వరకు ఆయనకు అవార్డు రాలేదు. ఈసారైనా వచ్చి తీరుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











