Home
విక్రం తమిళ-తెలుగు సినిమా భీమ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను భారీ నిర్మాత ఎఎం రత్నం లింగుస్వామి దర్శకత్వంలో నిర్మించనున్నారు. లింగుస్వామి గతంలో ఆనందం, ర న్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించని విక్రం ఉబ్బి తబ్బిబ్బై అనేక సార్లు హైదరాబాద్ వచ్చి మీడియాతో ముచ్చటించారు. ఆ ఆనందంలోనే ఆయన తెలుగులో ఒక ్రస్టెయిట్ సినిమా తీస్తానని ప్రకటించారు. తనకు నచ్చిన ముగ్గురు తెలుగు డైరెక్టర్ల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. ఆ ముగ్గురు వివి వినాయక్, గుణశేఖర్, ఎస్‌ఎస్ రాజమౌళి. ఆయన ఫైనల్‌గా రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. రాజమౌళి చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











