Home
అందాల రాముడు విజయంతో తను కూడా హీరోగా ప్రేక్షకులను మెప్పించగలనని నిరూపించిన సునీల్ మరోమారు హీరోగా తెర మీదకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సినీపరిశ్రమలో ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో రచయిత, దర్శకుడు త్రివిక్రమ్, సునీల్, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ముగ్గురూ రూమ్‌మేట్స్. పైగా సునీల్, త్రివిక్రమ్ ఇద్దరిదీ భీమవరమే. నాటి నుంచి వారి స్నేహం అలాగే కొనసాగుతూ వస్తోంది.
అందాల రాముడు చిత్రంలో కూడా త్రివిక్రమ్ హ్యాండ్ కొంతవరకూ ఉంది. గతంలో వారిద్దరూ కలిసి బంతి అనే టైటిల్‌తో కథ రాసుకున్నారని, దాన్ని ఇప్పుడు తీయవచ్చని భావిస్తున్నారని తెలిసింది. సునీల్ స్నేహితులే కొందరు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. మరొక స్నేహితుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కూడా ఉంది. త్రివిక్రమ్ అన్ని చిత్రాలలో చిన్న పాత్రయినా నవ్వులు కురింపించే విధంగా సునీల్ పాత్రలు రూపుదిద్దుతారు త్రివిక్రమ్. అటువంటిది సునీల్‌తో ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్‌ని ఆయన సృష్టిస్తే.. ఇక నవ్వులకు కొదవుండదు. ప్రస్తుతం అందాల రాముడు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా ఐదు వారాలగా బొమ్మరిల్లు చిత్రం తర్వాత రెండో స్థానంలో నిలబడుతూ వస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే పెద్ద హిట్ అని ట్రేడ్ వర్గాలు ప్రకటించేశాయి.


Click it and Unblock the Notifications











