తారల ప్రేమాయణం
మెగాస్టార్ చిరంజీవికి ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, మరణమృదంగం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. దీనితో కొద్దికాలం గ్యాప్ తీసుకున్న ప్రముఖ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా ఆయన ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ పుట్టినరోజు వేడుక పురస్కరించుకుని అక్టోబర్ 23న ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్ విలేఖరులకు వివరాలు తెలుపుతూ - ముందుగా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంలో ఓ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది - అన్నారు.
ప్రభాస్‌తో చిత్రం వచ్చే సంవత్సరం ఉంటుందని, సబ్జెక్ట్ కూడా సిద్ధమైందని పూరీ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందన్నారు. మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ తేజతో అశ్వినీదత్ నిర్మించే చిత్రం తరువాత ప్రభాస్ డేట్స్ బట్టి ఆ చిత్రం షెడ్యూల్ మొదలవుతుందని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











