Home
ఇవివి సత్యనారాయణ తనయుడు అల్లరి నరేశ్ ఖాళీ లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ సినిమా మీద సినిమా చేసేస్తున్నారు. నరేశ్‌కి హిట్ ఇవ్వాలని సంకల్పించి దర్శకడు ఇవివి కితకితలు రూపొందించి ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత నరేశ్‌కు వద్దంటే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
జనార్దన మహర్షి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న - గోపి (గోడ మీద పిల్లి) - చిత్రంలో నరేశ్ జగపతిబాబుతో కలిసి నటిస్తున్నారు. తర్వాత బజ్జూ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం - అల్లరే అల్లరి - చిత్రంలో వేణుతో కలిసి నరేశ్ నటిస్తున్నారు.
ఇది కాక, నరేశ్ సోలో హీరోగా గతంలో ప్రారంభమైన - సీమశాస్త్రి (బీభత్సమైన ఫ్యాక్షనిస్టు) - చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ విశేషాలను ఇటీవల విలేఖరులకు వివరించారు. ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఫ్యాక్షనిస్టు కుటుంబంలో అమ్మాయిని ప్రేమించిన సీమ శాస్త్రి తన ప్రేమను దక్కించుకోడానికి ఎలా మారాడన్న ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. నరేశ్ సరసన ఫర్జానా నటిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
నరేశ్ నటించిన ఈ మూడు చిత్రాలు ఇంచుమించు ఏకకాలంలో వరుసగా విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











