Home
ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక్క మగాడు చిత్రం రూపొందుతోందన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి బాలయ్య అభిమానుల్లో ఈ సినిమా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోంది. సొంత బ్యానర్ బొమ్మరిల్లు పతాకంపై వరుసగా సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మిస్తున్న దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి బాలయ్యతో చిత్రం చేస్తున్నట్టు ప్రకటించగానే అటు ట్రేడ్ వర్గాల్లో సైతం క్రేజ్ పెరిగింది.
ఇటీవలే ఒక్క మగాడు షూటింగ్ కార్యక్రమాన్ని చౌదరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ముహూర్తపు షాట్‌తో లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి నుండి తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో స్క్రిప్టు నుంచి పూజ చేయించారు. ఈ చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసే బాధ్యతను చౌదరి రచయిత పోసాని కృష్ణమురళికి అప్పగించారు. స్వరబ్రహ్మగా మెగా హిట్లు అందిస్తున్న మణిశర్మను సంగీత దర్శకుడిగా చౌదరి ఎంపిక చేసుకున్నారు.
దేవదాసు ఘనవిజయం తరువాత వై.వి.ఎస్. స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఒక్క మగాడు చిత్రం మీద హీరో బాలకృష్ణ కూడా నమ్మకంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పట్లో తానేమీ మాట్లాడనని, చిత్రం విడుదలయ్యాక అదే మాట్లాడుతుందని వై.వి.ఎస్. అంటున్నారు.
దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు ఇలియానాను పరిచయం చేసిన ఘనత దక్కించుకున్న చౌదరి ఒక్క మగాడు చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











