Home

By Staff

విష్ణుమూర్తికి ఒక్కో అవతారం ఎత్తడానికి ఒక్కో యుగం పట్టింది. కానీ స్వలాభం కోసం గంటకో అవతారం ఎత్తే వాళ్లే ఎక్కువవుతున్న ఈ కాలంలో అలాంటి ఒక ఘనుడిని చూసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆ ఘనుడే ఈ గోపి - అనగా గోడ మీద పిల్లి.

గోపిగా అల్లరి నరేశ్‌, ఒక ప్రత్యేక పాత్రలో జగపతిబాబు, హీరోయిన్లుగా ఆర్తి ఛాబ్రియా, గౌరీ ముంజల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు, ప్రముఖ కథారచయిత జనార్ధన మహర్షి. నిర్మాతలు పోలిశెట్టి రాంబాబు, పల్లి కేశవరావు.

ఇది పూర్తిగా హాస్యంతో సాగే కథ. మల్టీస్టారర్‌. ఒక ప్రత్యేక పాత్రలో వినోద్‌ కుమార్‌ కూడా నటిస్తున్నారు. సురేశ్‌, రంభ విష్ణుమూర్తి, శ్రీలక్ష్మి పాత్రల్లో కనిపిస్తారు. ఇంకా ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్పారు దర్శకుడు జనార్ధన మహర్షి.

కోటి స్వరపర్చిన గీతాలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయన్నారు. సినిమాకి ఆడియో చాలా ప్లస్‌ అవుతుందని చెప్పారు. నవంబర్‌ 16న అశేష ప్రజానీకాన్ని అలరించడానికి గోపి - గోడ మీద పిల్లి - విడుదలకు సిద్ధమవుతోంది.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X