Home
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ఎంఎస్ రాజు తదుపరి చిత్రం హరేరామ హరేహరే కృష్ణ హీరో ఎవరన్న సస్పెన్స్ వీడిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో, త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడు. మహేష్- త్రివిక్రంల అత డు సినిమా గత ఏడాది పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజు తన పాత హిట్ సినిమాల్లోని పాట చరణాన్ని కొత్త సినిమాలకు టైటిల్‌గా పెడుతుంటారు. గతంలో మహేష్ హీరోగా ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు సినిమాలో హరేరామ హరేకృష్ణ పాట ఉంది. కొత్త సినిమాకు ఆయన అదే టైటిల్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పని జరుగుతోంది. ఎంఎస్ రాజు ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న పౌర్ణమి సినిమా మార్చిలో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత రాజు గారు హరేరామ హరేకృష్ణ సినిమాను ప్రారంభించనున్నారు.
udaykiran holi nuvvu nenu richa sharma manasantha nuvve sriram telugu cinema tamil cinema still spotnews


Click it and Unblock the Notifications