Home
నయనతార పూర్తిగా తెలుగు సినిమాల మీదనే దృష్టి కేంద్రీకరిస్తోంది. తాజాగా ఆమె రవితేజ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి. నయనతార- వెంకటేష్‌ల సినిమా లక్ష్మి ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద హిట్‌గా నిలిచింది. రణం సినిమాకు దర్శకత్వం వహించిన అమ్మ రాజశేఖర్ రవితేజ నయనతార కాంబినేషన్‌లో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార, రవితేజ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాగార్జున తాజా చిత్రంలో, పి.వాసు-బాలకృష్ణల సినిమాలో నయనతార నటించనుంది. రవితేజ కూడా పూరీ జగన్నాధ్, రాజమౌళిల దర్శకత్వంలో నటించవలసి ఉంది. రవితేజ, నయనతార కలిసి నటించాలంటే మరో ఏడెనిమిది నెలలు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











