Home
పోకిరి సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్‌బాబు దాదాపు టాలీవుడ్ టాప్ అయ్యారు. అతనొక్కడే ఫేం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్నారు. ఈ సినిమాను కృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై ఘట్టమనేని రమేష్‌బాబు నిర్మిస్తారని తొలి వార్తలు తెలియజేస్తున్నాయి. మహేష్‌బాబు- గుణశేఖర్‌ల సినిమా సైనికుడు పూర్తయిన తర్వాత అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అతనొక్కడే సినిమాకు కథ కూడా సురేందర్‌రెడ్డి సమకూర్చారు. ఆయన రెండో సినిమా అయిన అశోక్ కథను వక్కంతం వంశీ రాసినప్పటికీ ఈ కథను సురేందర్ తన శైలిలోకి మార్చుకుని దర్శకత్వం వహించారు. మూడో సినిమా (మహేష్‌తో)కు సురేందర్ స్వయంగా కథను తయారు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











