Home
గీతా ఆర్ట్స్‌పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిరంజీవిద్విపాత్రాభినయ చిత్రం దాదాపుడెబ్బై శాతం పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కోసంముంబాయి నుంచిఅత్యాధునిక మోషన్ కంట్రోల్‌కెమెరాను తెప్పించారు. చిరంజీవి, టబులపైకొన్ని సన్నివేశాలను ఈ కెమెరాతో చిత్రీకరించారు. శ్రీని వైట్లదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వేసవిసెలవుల్లోమేలో విడుదల కానుంది. ఈ సినిమాకుబాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.స్నేహం కోసం సినిమా తర్వాత చిరంజీవి తండ్రీకొడుకులుగాద్విపాత్రాభినయ చిత్రం ఇదే.
తండ్రిచిరంజీవికి జంటగా టబు, కొడుకు చిరంజీవిసరసన రిమ్మీసేన్ నటిస్తోంది.ధూమ్ హిందీ సినిమాలో అభిషేక్ బచ్చన్‌భార్యగా నటించిన రిమ్మీసేన్‌కు ఇదే తొలితెలుగు సినిమా. ఈ సినిమాలో కొడుకు చిరంజీవిబుద్ధిమంతుడు కాగా తండ్రి చిరంజీవి అదోటైపు. తండ్రిది చంచల స్వభావం.కొడుకు చిరంజీవి తండ్రికి వ్యక్తిత్వవికాస పాఠాలు చెబుతుంటాడు. బాస్‌టైటిల్ చిరంజీవికి, అల్లు అరవింద్‌కు నటించినప్పటికీ ఎవరో ఒక ఫిటింగ్‌పెట్టారు. గతంలో విజయ బాపినీడు చిరంజీవితోతీసిన బిగ్ బాస్ ఫ్లాప్‌అయినందువల్ల ఈ సినిమాకు బాస్ అనేటైటిల్ పనికి రాదని చిరంజీవి శ్రేయోభిలాషులఅభిప్రాయం.


Click it and Unblock the Notifications











