Home
చిరంజీవి తాజాచిత్రం జై చిరంజీవకోసం అమెరికాలో భారీషెడ్యూలు ప్లాన్ చేశారు. ఏప్రిల్ తొమ్మిదినచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అమెరికాషెడ్యూలు మే పది నుంచి మొదలవుతుంది.కె.విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు కథనుత్రివిక్రమ్ సమకూర్చారు. సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పటికేరెండు పాటలు రికార్డు చేశారు.నువ్వు వస్తానంటే నేనొద్దంటానాసినిమా ప్రకృతిని, పాత్రలనుఅద్భుతంగా కెమెరాలో బంధించిన వేణుజై చిరంజీవకు ఛాయాగ్రహుడిగాఎంపికయ్యారు. చిరంజీవితో జగదేకవీరుడు- అతిలోక సుందరి, చూడాలనిఉంది, ఇంద్ర వంటి సూపర్‌హిట్ సినిమాలుతీసిన చలసాని అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఒక్కడు,సింహాద్రి, మిస్సమ్మ సినిమాల కథానాయికభూమిక ఒక హీరోయిన్‌గా,సమీరా రెడ్డి మరో హీరోయిన్‌గా నటిస్తారు.
More from Filmibeat
pawan kalyan johnny changes his style good relations with media new film has sada as heroine telugu cinema news


Click it and Unblock the Notifications











